సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన అందం, అభినయంతో సినీ రంగంలో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా సినిమాలలో తన సత్తా చూపిస్తూ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ త్రిష. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం భాషలోల అనేక చిత్రాల్లో నటించిన త్రిష.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన థగ్ లైఫ్ చిత్రం నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 5న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అదే సమయంలో, మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెలుగు చిత్రమైన విశ్వంభరలో నటిస్తోంది. తమిళంలో సూర్యతో కలిసి సూర్య 45 సినిమాలో హీరోయిన్గా ఎంపిక కాగా, మలయాళంలో మోహన్ లాల్‌తో కలిసి రామ్ అనే సినిమాలో నటిస్తోంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకెళ్తూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ యాక్ట్రెస్‌గా రాణిస్తోంది త్రిష. ఆమె నటనకు, గ్లామర్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు తమ ఇష్ట నటులపై చూపే ప్రేమకు హద్దులనేవి ఉండవు. కొంతమంది అభిమానులు గుడులు కట్టిస్తే, మరికొంత మంది విగ్రహాలు పెడతారు. సౌత్ ఇండస్ట్రీలో సమంత, నిధి అగర్వాల్, కుష్బూ వంటి హీరోయిన్లకు గుడులు ఉన్నాయి. కానీ ఒక హీరోయిన్ పేరుమీద ఊరు ఉందని మీకు తెలుసా?
అవును ఓ ఊరు నేరుగా హీరోయిన్ పేరు మీద ఉండడం చాలా అరుదైన విషయమే. అలాంటి అరుదైన గౌరవం ఇప్పుడు త్రిషకి దక్కింది. తాజాగా త్రిష పేరు మీద ఒక ఊరు ఉందని ఓ అభిమాని రివీల్ చేశాడు. లడఖ్‌లోని నూబ్రా లోయ నుంచి ప్రపంచంలోనే ఎత్తైన సియాచిన్ బేస్ క్యాంప్‌కి వెళ్లే మార్గంలో విజయక్ త్రిష అనే ఊరు ఉందని తెలిపాడు. ఆ ఊరు బోర్డు ముందు నిలబడి వీడియో తీసి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఈ వీడియోను చూసిన త్రిష ఆశ్చర్యానికి గురయ్యింది. తన పేరుతో ఓ ఊరు ఉందన్న విషయం తెలుసుకొని తెగ ఆనందపడింది. వెంటనే ఆ వీడియోకి లైక్ కూడా కొట్టింది. ఫ్యాన్స్ ప్రేమకు మరోసారి త్రిష ఫిదా అయింది.






