‘ది రాజా సాబ్’ టీజర్ ఎప్పుడంటే..? ఇది అభిమానులకు స్పెషల్ డేట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, నిధి అగర్వాల్( Nidhhi Agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్స్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ రొమాంటిక్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్‌ చిత్రం “ది రాజా సాబ్”(The Raja Saab). ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ హైప్ నడుస్తోంది.

ఈ చిత్రం హ్యారీ పోటర్ రేంజ్‌లో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతోందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీజర్ విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా, తాజాగా టీజర్ విడుదల తేదీ లాక్ అయ్యినట్టు సమాచారం. ‘ది రాజా సాబ్’ టీజర్‌ను ఈ నెలజూన్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిఉంది. టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, స్టార్ కాస్టింగ్ అన్నింటినీ బట్టి చూస్తే, ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన హై ఫాంటసీ హారర్ ఎంటర్టైనర్‌గా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *