త్రిష మహేష్ బాబు కాలేజీ రోజుల్లేనే! ఈ సీక్రెట్ మీకు తెలుసా?

మహేష్ బాబు, త్రిష జంటగా అతడు సినిమాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష పల్లెటూరి అల్లరి అమ్మాయిగా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అతడు అభిమానుల‌కు ఆల్ టైమ్ ఫేవ‌రెట్ మూవీ గా నిలుస్తుంది.

ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సైనికుడు చిత్రంలో నటించారు. ఈ సినిమా థియేటర్లలో సరిగా ఆడలేదుకానీ చిన్నతెరపై మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఆ రెండు సినిమాల తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటించలేదు. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినా, మళ్లీ కలిసి నటించకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

ఇటీవల త్రిష ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, అతడు నా ఫేవరెట్ యాక్టర్స్‌లో ఒకరు. అంత పెద్ద సూపర్‌స్టార్‌ అయినప్పటికీ ఆయన చాలా వినయంగా, గౌరవంగా ఉంటాడు. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది అని తెలిపింది.

తదుపరి ఆమె చెప్పిన విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. “చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నటనలోకి రాకముందే నాకు ఆయనతో పరిచయం ఉంది. కాలేజ్ రోజుల్లో ఆయన చెన్నైలో ఉండేవాడు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఆయనతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఎవరికీ మేము నటులు అవుతామన్న ఆలోచన లేదు,” అని త్రిష గుర్తుచేసుకుంది.

మహేష్‌కు ఉన్న వర్క్ ఎథిక్‌ను పొగుడుతూ.. అతను షూటింగ్‌లో చాలా కష్టపడతాడు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉంటాడు. అతని కష్టాన్ని చూసి నాకు గిల్టీగా అనిపించేది. మహేష్ షూటింగ్ సమయంలో కారవాన్‌లోకి వెళ్లడం కూడా ఉండదు. ప్రతి సీన్‌ని మానిటర్ ముందు కూర్చుని జాగ్రత్తగా గమనిస్తాడు. కామెడీ సీన్స్ అయినా, ఇతర నటుల సన్నివేశాలైనా ఎంతో పేషెన్స్‌తో చూస్తూ ఉంటాడు,” అని తెలిపింది త్రిష.

త్రిష ఇటీవ‌ల టాలీవుడ్ సినిమాకి సంత‌కం చేసింది. తెలుగులో విశ్వంబర చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తోంది. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతోన్న’విశ్వంభర’ సోషియో ఫాంటసీ చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 తెరకెక్కబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న ఈ చిత్రానికి దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడిందని సమాచారం.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *