
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్(Chenab) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఇంజినీరింగ్ అద్భుతాలతోపాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చీనాబ్ బ్రిడ్జి (Chenab Bridge)పై అత్యాధునిక వందే భారత్ రైలు(Vande Bharat Train) పరుగులు పెట్టనుంది. ఈ మేరకు ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) ఉదయం 11గంటలకు చీనాబ్ వంతెన డెక్‌ను సందర్శించి, దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా నుంచి శ్రీనగర్‌కు వెళ్లే 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభిస్తారు.
రూ.50 కోట్ల అంచనాతో..
ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడగా ఇప్పటికి పూర్తి అయింది. అయితే రూ.50 కోట్ల అంచనాతో పూర్తి చేయాలనుకున్న ఈ రైల్వే లైన్ కాస్త, ఇప్పుడు రూ.43,800 కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కశ్మీర్‌కు ఒక రైలు మార్గం పడనుంది. స్టీమ్ ఇంజిన్ రైలు(Steam engine train)ను నడిపించాలని మొదట భావించగా.. ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు ఆ మార్గంలో పరుగులు పెట్టనుంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా మధ్య 272KM దూరం ఈ ట్రాక్‌ను నిర్మించారు.
ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ
చీనాబ్ రైల్వే వంతెన, రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరి మధ్య నిర్మించినది. ఇది చీనాబ్ నదిపై 359 మీటర్ల (1,178 అడుగుల) ఎత్తులో ఉంది. ఇది ప్యారిస్‌లోని 330 మీటర్ల ఈఫిల్ టవర్(The Eiffel Tower) కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. 1,315 మీటర్ల పొడవు గల ఈ వంతెన, 27,000 టన్నుల ఉక్కుతో నిర్మితమైంది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునేలా రూపొందించారు. 2002లో నిర్మాణం మొదలుపెట్టగా 2022లో పూర్తయింది.
भारत एक और नया कीर्तिमान स्थापित करने जा रहा है,
इंतजार की घड़ियां खत्म होने वाली है,क्योंकि देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 6 जून को विश्व के सबसे ऊंचे रेलवे पुल, चिनाब ब्रिज राष्ट्र को समर्पित करेंगे…1/3#Chinabridge #NewIndia pic.twitter.com/nT2MuOUysn
— राणसिंह राजपुरोहित (@ransinghBJP) June 5, 2025