బ్యాంకు లోన్లు(Bank Loans) తీసుకున్న వారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేటు(Repo rate)ను భారీగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు(Basis Points) తగ్గించడంతో కొత్త రేటు 5.5 శాతానికి చేరింది. ఈ నిర్ణయం వల్ల లాంగ్ టర్మ్ లోన్లు, హోమ్ లోన్లు, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్లు తీసుకున్న వారికి EMIల భారం తగ్గే అవకాశం ఉంది.
ఏకగ్రీవ నిర్ణయంతో ఆమోదం..
ప్రతి 2 నెలలకోసారి జరిగే MPC సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు RBI వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిరేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై లోతైన చర్చ జరిగిన అనంతరం వడ్డీ రేట్ల తగ్గింపున(Interest rate cuts)కు కమిటీ సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. RBI రెపోరేట్ తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఉదయం ఫ్లాటుగా ప్రారంభమైన బ్యాంకింగ్, NFBC, పలు ఆటో షేర్లు ఒక్కసారిగా గ్రీన్‌లోకి వచ్చేశాయి.
The Reserve Bank of India (RBI) on Friday announced its second bi-monthly monetary policy of FY26. The RBI Governor Sanjay Malhotra-led Monetary Policy Committee (MPC) decided to cut the repo rate by 50 basis points (bps) to 5.50% from 6.00% earlier. pic.twitter.com/FJBcLvy37k
— Vivek (@Vivek_mishra55) June 6, 2025






