Shine Tom Chacko: ‘దసరా’ నటుడికి గాయాలు.. తండ్రి మృతి!

మలయాళ నటుడు, దసరా మూవీ విలన్​ షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. తమిళనాడులో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షైన్‌ టామ్‌ చాకో తండ్రి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో నటుడితోపాటు, ఆయన తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. వారితోపాటు డ్రైవర్​కు కూడా తీవ్ర గాయాలు కావడంతో అందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి..

 

ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. చాకో కుడి చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *