Akhil-Zainab Wedding: అక్కినేని ఇంట్లో పెళ్లిబాజాలు.. ఒక్కటైన అఖిల్-జైనబ్

అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ అక్కినేని(akkineni akhil) వివాహం ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గ్రాండ్‌గా జరిగింది. అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ రవడ్జీ(zainab ravdjee) మెడలో మూడుముళ్లు వేశాడు. ఈ వివాహ వేడుక జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో‌స్‌(Annapurna Studios)లో అత్యంత వైభంగా జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు నాగార్జున-అమల(Nagarjuna-Amala) దంపతులు, నాగచైతన్య-శోభిత(Nagachaitanya-Sobhitha) కపుల్స్‌తోపాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుమంత్‌తోపాటు ఇతర సినీ నటుడు, పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫొటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. కాగా జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్(Reception) వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *