మృగశిర కార్తె(Mrigasira Karthi)ను పురస్కరించుకొని చేప ప్రసాదం పంపిణీ(Fish Prasadam Distribution)కి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్థులకు బత్తిని కుటుంబీకులు(Bathini family) ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం(Nampally Exhibition Grounds)లో ఇవాళ, రేపు పంపిణీ చేయనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad Kumar), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)తో కలిసి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు (జూన్9) ఉదయం 9 గంటల వరకూ కొనసాగనుంది. ఇందుకోసం దాదాపు రెండు లక్షల చేపపిల్లల్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా చేప ప్రసాదం కోసం టైమ్ ప్రకారం ప్రత్యేక టోకెన్లు(Tokens) ఇవ్వనున్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని..
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి చేప ప్రసాదం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పక్కాగా చేశారు. 42 క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. GHMC అధికారులు పారిశుధ్యంతో పాటు మొబైల్ టాయిలెట్ల(Mobile toilets) ఏర్పాటు, వాటర్‌వర్క్స్ అధికారులు మంచినీటి సరఫరాకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే ఉబ్బస వ్యాధిగ్రస్థులు(Asthma Patients) నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకునేందుకు గాను నగరంలోని వివిధ రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ప్రత్యేక RTC బస్సులను ఎగ్జిబిషన్ మైదానానికి ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లోపల, బయట దాదాపు వెయ్యి మంది పోలీసులు, ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Bathini Family To Distribute Fish Prasadam On June 8, 9 At Nampally Exhibition Groundshttps://t.co/SDsq87C0J8#fishprasadam#Bathinifishprasadam#NampallyExhibitionGrounds#asthma
— Deccan Chronicle (@DeccanChronicle) May 28, 2025






