మహేశ్వరి లేటెస్ట్ లుక్ చూసారా? అప్పటి హీరోయిన్ ఇప్పుడిలా ఉంది! ఏం చేస్తోందో తెలుసా?

గులాబి(Gulabi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచేసింది హీరోయిన్ మహేశ్వరి(Maheswari). 1995లో విడుదలైన గులాబి సినిమా, అప్పటి యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. దర్శకుడు కృష్ణవంశీకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. అదే విధంగా హీరో జె.డి. చక్రవర్తికి(J.D Chakravarthi) కమర్షియల్ హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. గులాబి సినిమాను గుర్తు చేసుకుంటే, ఇప్పటికి యూత్ మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లిపోతారు. ఆ హిట్ మ్యూజిక్, ఆ ప్రేమకథ, ఆ రొమాంటిక్ ఫీలింగ్.. అన్నీ కలిపి గులాబి సినిమాని ఒక కలల లోకంలా మార్చాయి.

అయితే గులాబి సినిమా అంటే, చాలామందికి ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ మహేశ్వరి. ఈ సినిమాతో మహేశ్వరి అప్పటి యువతలో స్టార్ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఆమె చేసిన తక్కువ సినిమాలే అయినా, ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేసుకుంది. గులాబి సినిమాతో మాత్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గులాబి తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేకపోయాయి. అయితే రవితేజతో నటించిన నీ కోసం సినిమాలో ఆమె నటనకు నంది అవార్డు లభించింది.

ఇంకా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో మహేశ్వరి వెండితెరకు వీడ్కోలు పలికింది. అయితే నటనపై ఉన్న ఆసక్తిని వదలకుండా, బుల్లితెరపై అడుగుపెట్టింది. మై నేమ్ ఈజ్ మంగతాయారు అనే టీవీ సీరియల్‌లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. ఈ సీరియల్‌తో మరోసారి తన నటనను నిరూపించుకుంది.

గులాబి తర్వాత మహేశ్వరి జె.డి. చక్రవర్తితో మరో రెండు మూడు సినిమాల్లో నటించింది. ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ రావడంతో, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో జెడి ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడన్న కథనాలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ చివరికి మహేశ్వరి ప్రముఖ వ్యాపారవేత్త జై కృష్ణన్‌ను వివాహం చేసుకుంది. జెడి మాత్రం మరో నటిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

పెళ్లి తర్వాత చాలా మంది మహిళల లుక్స్‌లో మార్పులు సహజమే. కానీ మహేశ్వరి మార్పు మాత్రం కొంత మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి మహేశ్వరిని చూసిన వారు ఇప్పటి మహేశ్వరి చూసి ఈమె గులాబి సినిమా హీరోయినా ? అని ఆశ్చర్యపోతుంటారు.

మరోవైపు, మహేశ్వరి ఫ్యాషన్‌లో తనదైన శైలి చూపించేందుకు ప్రయత్నించింది. బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి స్వయంగా హైదరాబాద్‌లో మహేశ్వరి కోసం ఒక బుటిక్ ప్రారంభించింది. మహేశ్వరి ఫ్యాషన్ కలెక్షన్స్ పేరుతో ఓ క్లాతింగ్ స్టోర్‌ కూడా నడుపుతోంది. మహేశ్వరి ప్రస్తుతం వ్యాపార రంగంలో ముందుకు సాగుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *