‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty). టాలీవుడ్(Tollywood)లో ‘వేదం’, మిర్చి, రుద్రమదేవి, పంచాక్షరి, బాహుబలి(Bahubali) వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత అనుష్క సినిమాలు అపడపాదడపా మాత్రమే వస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత పెద్ద సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కనిపించనే లేదు. 2023లో చివరగా ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద అంతంత మాత్రంగానే నడిచింది. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తర్వాత మిస్ శెట్టి నటిస్తున్న చిత్రం ‘ఘాటి(Ghaati)’. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో విడుదలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఎలాంటి హడావిడి లేకుండానే..
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తెరకెక్కిస్తున్న ఘాటి సినిమాలో ఎలాంటి హడావిడి లేకుండానే పూర్తయింది. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ గింప్స్ విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ పాత్రలో అనుష్క కనిపించనుంది.
పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు
ఇక జులై 11న ఈ మూవీని రిలీజ్(Ghaati Release) చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు పలు భాషల్లోనూ విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్స్(Promotions) నిర్వహించాలని మూవీ టీమ్ భావిస్తోంది. అయితే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్‌కు అనివార్య కారణాల వల్ల అనుష్క హాజరుకాదని Tటౌన్‌లో న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ అదే నిజమైతే మూవీపై ప్రభావం పడుతుందని సినీవర్గాల్లో చర్చల్లో నడుస్తోంది.






