ముంబైకు చెందిన మంజరి ఫడ్నిస్(Manjari Fadnnis), ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. అల్లరి నరేష్(Allari Naresh ) హీరోగా నటించిన ఈ సినిమాలో మంజరి అల్ట్రా గ్లామరస్ లుక్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఏడాదిలో వచ్చిన ‘శుభప్రదం’ సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా, సంపూర్ణ ట్రెడిషనల్ గెటప్‌లో కనిపించి అందరి మనసులు గెలుచుకుంది.
‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమా బాక్సాఫీస్ హిట్ ని అందుకుంది. ఆ తరువాత ‘రాజా ఇంకోసారి’, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో నటించిన ‘శక్తి’ చిత్రంలోనూ హీరోయిన్గా కనిపించింది. అయితే ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్‌గా మారిపోయాయి. దీంతో ఆమె తెలుగు చిత్రసీమకు కొంత దూరమైంది.
తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన ఈ ముద్దు గుమ్మ.. బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ‘గ్రాండ్ మస్తీ’, ‘సర్వ్ మంగళ్ సావధాన్’, ‘కిసి కిసికో ప్యార్ కరూన్’, ‘నిర్దోష్’ లాంటి హిందీ సినిమాల్లో నటించి మళ్లీ కెరీర్ కొనసాగించింది. సినిమాలకి తోడు, మంజరి ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా ఉంటుంది.
View this post on Instagram
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె బొద్దుగా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో స్లిమ్ ఫిగర్‌తో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన మంజరి, ఇప్పుడు కొత్త గెటప్‌తో సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది.
మంజరి ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలకంటే వెబ్ కంటెంట్‌లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తన నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.







