ICC WTC-2025: నెరవేరిన 27 ఏళ్ల కల.. సౌతాఫ్రికాదే టెస్ట్ ఛాపింయన్ షిప్

సౌతాఫ్రికా(South Africa) సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో నెగ్గింది. చారిత్రక లార్డ్స్ మైదానంలో జయకేతం ఎగరేసి సగర్వంగా టెస్టు ఛాంపియన్ షిప్(ICC World Test Championship) గదను ఎత్తుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)ను మూడున్నర రోజుల్లోనే చిత్తు చేసి ఘనవిజయం సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC Fina 2025) ఫైనల్‌లో శనివారం కంగారూలపై 5 వికెట్ల తేడాతో నెగ్గి హిస్టారికల్ విక్టరీ సాధించింది. 69 పరుగుల లక్ష్యంతో 213/2 స్కోరుతో ఇవాళ నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐదెన్‌ మార్‌క్రమ్‌ (136) అద్భుత శతకంతో సఫారీల చిరకాల కలను నెరవేర్చాడు.

ICC Test Championship 2025

కంగారూలకు చుక్కలు చూపించారు..

ఈ మ్యాచులో జూన్ 11న ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన కంగారూలకు సఫారీ బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్ రబాడ(Kagiso Rabada) నిప్పులు చెరిగే బంతులో చెలరేగాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ (66), వెబ్ స్టర్ (72) మాత్రమే రాణించారు. ప్రొటీస్ బౌలర్లలో రబాడ 5, జాన్సెన్ 3 వికెట్లు తీశారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో 74 పరుగులు వెనకబడింది. సఫారీ బ్యాటర్లలో బవుమా (36), బెడింగ్హమ్ (45) రన్స్ చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్(Pat Cummins) 6 వికెట్లతో చెలరేగాడు. స్టార్క్ 2 వికెట్లు తీశాడు.

Image

రబాడ.. రెండో ఇన్నింగ్స్‌లో హీరో అయ్యాడు

ఇక 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్..తొలి ఇన్నింగ్స్‌లోలానే బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో కేవలం 207 పరుగులకే కుప్పకూలింది. ఈ సారి ఆ జట్టులో క్యారీ (43), స్టార్క్ (58) మినహా మిగతా వారంతా నిరాశపర్చారు. బౌలింగ్‌లో మళ్లీ రబాడ హీరో అయ్యాడు. అతడు 59 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఎంగిడి 3 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ 74 రన్స్‌తో కలుపుకొని 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సౌతాఫ్రికాకు నిర్దేశించింది.

Image

భారీ టార్గెట్.. మార్క్రమ్ అద్భుత సెంచరీ

బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు.. ఓపెనర్ ఏడెన్ మార్క్రమ్(Aiden Markram) (136) సూపర్ సెంచరీతో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మల్డర్ (27), కెప్టెన్ బవుమా (66) అద్భుతంగా సహకరించారు. ఈ క్రమంలో విజయానికి 6 పరుగుల దూరంలో మార్క్రమ్ అవుటైనా బెడింగ్హమ్ (21*), వెర్రీయన్ (4*) పరుగులతో సఫారీలకు మరుపురాని విజయాన్ని అందించారు. కంగారూ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీయగా.. హేజిల్ వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. అద్భుత సెంచరీతో చెలరేగిన మార్క్రమ్‌కు “Man Of The Match” అవార్డు దక్కింది. కాగా సౌతాఫ్రికా చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్‌ను నెగ్గింది. ఫైనల్స్‌లో ఒత్తిడికి గురై ఓడిపోతుందని తన మీద ఉన్న అపవాదును దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో తొలగించుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *