
కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రికి వారంలో రెండోసారి
కాగా సోనియా గాంధీ ఇదే ఆసుపత్రిలో ఈ నెల 9న వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దానికి రెండు రోజుల ముందు ఆమె సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (IGMC)లో చేరిన విషయం విదితమే. అధిక రక్తపోటు(high blood pressure)తో బాధపడిన సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు. తాజాగా ఆమె ఢిల్లీకి వచ్చిన తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ హెల్త్ కండీషన్(Sonia Gandhi’s health condition) పై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.
BREAKING NEWS 🚨 Sonia Gandhi admitted to Ganga Ram Hospital in Delhi. pic.twitter.com/YH3sLOOiQm
— Times Algebra (@TimesAlgebraIND) June 15, 2025