ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తిని రేపుతున్న సినిమా “కుబేర”. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ సినిమా నుంచి ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ట్రైలర్ హైలైట్స్:
ఈ ట్రైలర్ చూస్తే, శేఖర్ కమ్ముల మార్క్ ఏ లెవెల్లో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి విజువల్లోనూ ఆయనదైన స్పష్టత, ఎమోషనల్ డెప్త్ కనిపిస్తాయి. ముఖ్యంగా ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna), పాత్రల మధ్య ఉన్న మిస్టరీ సస్పెన్స్ హైపును మరింత పెంచేస్తుంది. బిచ్చగాడిని ఎందుకు ఎంచుకున్నాడు? అతన్ని మించి ఎందుకు ఎదిగాడు? వారి మధ్యలో ఏం జరిగింది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి.
రష్మిక పాత్రలో సర్ప్రైజ్:
రష్మిక మందన్నా(Rashmika Mandanna) పాత్రకూ ట్రైలర్లో మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆమె పాత్ర కథలో కీలకంగా వ్యవహరించనుందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఆమె ఎమోషనల్ యాక్టింగ్ కూడా ట్రైలర్లో ఆకట్టుకుంటుంది.
సోషల్ థీమ్‌తో కథా తంతు:
ఈ సినిమా సామాజిక అంశాలనూ స్పర్శించినట్టు కనిపిస్తోంది. ధనికులు, నిరుపేదల మధ్య వ్యత్యాసం, సామాజిక వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తే టోన్ ట్రైలర్లో కనిపిస్తోంది. ధనుష్ పాత్ర ఎలాంటి జీవన ప్రయాణం చేస్తుంది? అతని ప్రపంచం ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలు ఇందులో ఉన్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్:
దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్లలో ఆయన మ్యూజిక్ మరింత ఉత్కంఠను తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు కూడా స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజువల్స్, ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అన్నీ హై క్వాలిటీ స్టాండర్డ్స్ లో ఉన్నాయి.
20న థియేటర్లలో:
మొత్తానికి “కుబేర” ట్రైలర్ అంచనాలను మించి ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల మేజిక్, ధనుష్, నాగార్జున పాత్రల మధ్య సస్పెన్స్, రష్మిక నటన, బిగ్ స్కేల్ మేకింగ్ ఇవన్నీ కలవడంతో సినిమా మీద అంచనాలు రెట్టింపుయ్యాయి. జూన్ 20న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.






