పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘రాజా సాబ్’పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘రాజా సాబ్’ టీజర్ జూన్ 16 సోమవారం (ఈరోజు) విడుదల చేసారు.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజగా రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో స్పష్టమవుతోంది. మారుతీ స్టైల్ మేకింగ్, ప్రభాస్ కటౌట్ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ టీజర్ లో హారర్ ఎలివేషన్స్, ఫన్నీ డైలాగ్స్ మరో హైలైట్ కాగా.. నిధి అగర్వాల్ అందంతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు.
టీజర్‌లోని విజువల్స్, హాస్యాన్ని కలగలిపిన హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురు హీరోయిన్లు, కమెడియన్లు తమ ప్రత్యేకతతో టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చారు. ఇక డార్లింగ్ ప్రభాస్‌ను దర్శకుడు మారుతి చూపించిన విధానం అభిమానులను మెప్పిస్తోంది. టీజర్ చివర్లో వచ్చే శాట్, డైలాగ్ మాత్రం స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. మొత్తంగా టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేలా ఉంది.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ పూర్తిగా వేరే షేడ్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం. జాన్ సినిమా డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ మరియు నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ పని చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.






