‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) లీడ్ రోల్లో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన కొత్త చిత్రం ‘8 వసంతాలు(8 Vasantalu)’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్(Trailer)లో హృదయాన్ని కదిలించే ప్రేమ గాథతో సాగింది. ఈ ట్రైలర్లో సాగిన డైలాగ్స్.. ఒక్కోటి ఒక్కో అద్భుతం అనేలా ఉన్నాయి. ఒక అమ్మాయి జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad)లో మంగళవారం రాత్రి ‘8 వసంతాలు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతిక తన ప్రతిభ చూపారు. నృత్యం, మార్షల్ ఆర్ట్స్(Martial Arts)తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి అనంతిక స్టంట్స్ మీరూ చూసేయండి..
Prakruthi Pralayam
Take a bow #Ananthika
#8Vasantalu pic.twitter.com/yxbm2DOTsd
— S (@UrsShareef) June 17, 2025






