Ananthika Sanilkumar: ‘8 వసంతాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్టేజీపైనే హీరోయిన్ స్టంట్స్

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన కొత్త చిత్రం ‘8 వసంతాలు(8 Vasantalu)’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌(Trailer)లో హృదయాన్ని కదిలించే ప్రేమ గాథతో సాగింది. ఈ ట్రైలర్‌లో సాగిన డైలాగ్స్.. ఒక్కోటి ఒక్కో అద్భుతం అనేలా ఉన్నాయి. ఒక అమ్మాయి జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌(Hyderabad)లో మంగళవారం రాత్రి ‘8 వసంతాలు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతిక తన ప్రతిభ చూపారు. నృత్యం, మార్షల్‌ ఆర్ట్స్‌(Martial Arts)తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి అనంతిక స్టంట్స్ మీరూ చూసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *