New Trailer: భయానక విరాటపాలెం చుట్టూ కథ.. ఆసక్తి రేపుతున్న కొత్త సిరీస్ ట్రైలర్

ఇన్ఫ్లుయెన్సర్ అభిజ్ఞ ఉత్తలూరు (Abhignya Vuthaluru) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌’(Viraatapalem: pc Meena Reporting). రెక్కీ, వధువు లాంటి సినిమాలను తెరకెక్కించిన కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ జూన్‌ 27 నుంచి జీ5 (ZEE 5) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 1980ల నాటి మారుమూల భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? ఆ గ్రామంలో పెళ్లి రోజునే వధువులు ఎందుకు చనిపోతున్నారు? దశాబ్ద కాలంగా అక్కడ వివాహాలు ఎందుకు జరగడం లేదు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. సిరీస్పై ఆసక్తి రేపుతున్న ఈ ట్రైలర్ను మీరూ చూసేయండి.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *