ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day, June 21) సందర్భంగా ‘Fit India Couple’ అవార్డు లభించింది. ఈ ప్రత్యేకమైన రోజున ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల రకుల్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రజలను యోగా(Yoga) సాధన వైపు ప్రోత్సహించే కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని రకుల్ పేర్కొంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… “ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు దక్కించుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలను యోగావైపు ఆకర్షితులను చేయడంలో భాగం కావడం ఆనందంగా ఉంది” అని తెలింది.
#WATCH | Delhi | #InternationalYogaDay | Actor Rakul Preet Singh says, “We got the award of ‘Fit India Couple’ on the occasion of International Day of Yoga…We hope to influence people to make fitness a way of life…” pic.twitter.com/j61kdkMNSu
— ANI (@ANI) June 21, 2025
ఎలాంటి ఫ్యాన్సీ జిమ్‌లు అవసరం లేదు..
కాగా ఫిట్‌నెస్ సాధించడానికి ఖరీదైన జిమ్‌లు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదని ఆమె స్పష్టం చేసింది. “ఎలాంటి ఫ్యాన్సీ జిమ్(Gyms)లు అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్(Fit)గా మారొచ్చు” అని రకుల్ వ్యాఖ్యానించింది. యోగా అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా సులభంగా ఆచరించవచ్చని తెలిపింది. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆమె సూచించింది. రకుల్ వెంటన తన భర్త జాకీ భగ్నానీ(Jackie Bhagnani) కూడా ఉన్నాడు. కాగా ప్రస్తుతం రకుల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.







