Pawan Kalyan: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ పార్ట్ 1 రిలీజ్ డేట్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ మూవీని జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్(Official Announcement) చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనుకున్న తేదీ ప్రకారం ఈ మూవీ ఈనెల 12నే థియేటర్లలోకి రావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. .

శక్తిమంతమైన యోధుడి పాత్రలో..

‘హరిహర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌(Harihara Veeramallu: Part 1- Sword vs Spirit)’ పేరుతో రానున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి(Historical warrior) పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. పవన్ రాజకీయా(Politics)ల్లో బిజీ కావ‌డం, తదితర కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. మొదట క్రిష్(Krish) దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా బాధ్యతలను ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna) చేపట్టారు.

Pawan Kalyan gets objectifying lyrics changed in Hari Hara Veera Mallu  'item' song; internet questions why it's there - Hindustan Times

ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్

కాగా, ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol), అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ తేదీపై క్లారిటీ రావడంతో పవన్, మెగా ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *