Ram Charan: పులి పిల్లకు రామ్ చరణ్ కూతురి పేరు

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) ఓ పులి పిల్లకు తన కూతురి పేరు పెట్టింది. ఇందుకు సంబంధించి ఎక్స్లో ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశారు. శుక్రవారం తన కూతురు క్లీంకార పుట్టినరోజు (klin kaara) సందర్భంగా ఉపాసన తన కూతురితో కలిసి హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్ను సందర్శించారు. జూలోని ఓ ఆడ పులికి క్లీంకార అని పేరు పెట్టింది. క్లీంకారతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఉపాసన తన కూతరు క్లీంకారను ఎత్తుకొని ఆ పులిని చూస్తూ కనిపించారు. ఈ సందర్భంగా జూ బృందానికి ఆమె థాంక్స్‌ చెప్పారు.

పులి పిల్లను దత్తతు తీసుకున్న ఉపాసన

నెహ్రూ జూపార్కులో పులి పిల్లను ఉపాసన దత్తత తీసుకున్నారు. అంతకుముందు కుమార్తెతో కలిసి జూకు చేరుకున్న ఆమె వివిధ జంతువుల ఎన్‌క్లోజర్లను వీక్షించారు. అనంతరం జూపార్కు డైరెక్టర్‌ డా.సునీల్‌ ఎస్‌.హిరేమత్‌ను సంప్రదించి పులి పిల్లను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. దాని పోషణకు అవసరమైన డబ్బులను చెక్కు రూపంలో జూపార్కు డైరెక్టర్‌కు అందజేశారు.

క్లీంకార పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది

ఈ సందర్భంగా ఉపాసన ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఒక ఏడాది క్రితం అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ, ఈరోజు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి. దానికి మా కుమార్తె క్లీంకార పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్‌ జూ బృందానికి ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవికే సొంతమైనప్పటికీ, వాటిని సంరక్షించడానికి మనం మద్దతు తెలుపుతుంటాం’ ఆమె పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *