ఒకప్పుడు హీరోలు(Hero’s) కేవలం మెయిన్‌లీడ్‌లో నటించేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ విలన్ పాత్రల(Villain characters)లో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. అయితే, ఇటీవల సినిమాలన్నీ పాన్ ఇండియా(Pan ndia) స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు(Star Actors) కూడా కథా ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో కార్తి(Kollywood star hero Karthi) సైతం విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారని T-టౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తన అభిమాన హీరో టాలీవుడ్ హీరో కోసం..
ఈయన ఇదివరకే ఇలాంటి పాత్రలలో ప్రేక్షకులను మెప్పించారు కానీ ఈసారి తన అభిమాన హీరో టాలీవుడ్(Tollywood) హీరో మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరి ఏ హీరోతో కార్తి(Karthi) ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారనే విషయానికి వస్తే… టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్తి ఫేవరెట్ హీరో ప్రభాస్(Prabhas) అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘‘స్పిరిట్’(Spirit)’ సినిమాలో నెగిటివ్ పాత్ర(Negative Role)లో కార్తి కనిపించబోతున్నారని సమాచారం.

ఇప్పటికే భారీ అంచనాలు.. అదే నిజమైతే..
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీపై.. తాజా న్యూస్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కార్తి ఈ మూవీలో విలన్ రోల్‌లో నటిస్తున్నారని వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్(Fans) ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా నిజమైన అభిమాని అంటే మీరే అంటూ ప్రభాస్ కామెంట్లు చేస్తున్నారు. మరి సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న స్పిరిట్(Spirit) సినిమాలో విలన్ పాత్ర అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూవీలో కార్తి రోల్‌పై ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
Actor #Prabhas 🗿
Director #SandeepReddyVanga 🗿
Associate Director #Rgv 🗿
Actress #TriptiiDimri 🔥#Spirit pic.twitter.com/Skdny6A7Eu— Prabhas Vortex (@Viswa_Ethan) June 24, 2025






