రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు లేవు..! కన్ఫర్మ్ చేసిన కాజోల్

రీసెంట్ గా బాలీవుడ్ నటి కాజోల్‌ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ కావడం చూసే ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయని, తాను ఓ సందర్భంలో ఎంతగానో భయానికి లోనయ్యానని కాజోల్ చెప్పడంతో ఈ కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశమని కూడా చెప్పిన ఈ హీరోయిన్, షూటింగ్ సమయంలో కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని అనేసింది.

దీంతో ఎంతోమంది కాజోల్‌ చేసిన ఈ దెయ్యం కామెంట్లను తప్పుబట్టారు. ఈ రోజుల్లో కూడా దెయ్యలేంటి అని కొందరు అనగా, ఇంకొందరు కాజోల్ పై ట్రోల్స్ కి దిగారు. ఈ పరిస్థితుల నడుమ ఇదే ఇష్యూపై మరోసారి రియాక్ట్ అయింది కాజోల్. రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు అంటూ తాను చేసిన ఆ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్.. తాను చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం వల్ల మళ్ళీ స్పందించాల్సి వస్తోందని చెబుతూ క్లారిటీ ఇచ్చింది. తాను రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో సినిమాల షూటింగుల్లో పాల్గొన్నానని, చాలారోజుల పాటు అక్కడే స్టే చేసిన సందర్భాలు బోలెడున్నాయని చెప్పింది. అదొక మంచి పర్యాటక ప్రదేశం అని చెప్పింది, అక్కడ చాలా ప్రొఫెషనల్ వాతావరణం కనిపిస్తుందని కాజోల్ పేర్కొంది కాజోల్. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడం కారంగానే ఆమె ఇలా యూటర్న్ తీసుకుందని కొందరు మళ్ళీ ఆమెను ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *