AP PGCET 2025: ఏపీ పీజీసెట్ ఫలితాలొచ్చేశాయ్..

ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET 2025) ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Education Minister Nara Lokesh) ఫలితాలను ఎక్స్(X) వేదికగా రిలీజ్ చేశారు. కాగా ఈ ఏడాది ఏపీపీజీసెట్‌లో 88.60 శాతం మంది క్వాలిఫై అయినట్లు మంత్రి తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 9 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షల్లో 25,688 మంది విద్యార్థులు ఎగ్జామ్స్(Exams) రాయగా.. 19,488 మంది ఉత్తీర్ణులు అయ్యారు.

వీరిలో 7,463 బాలురు అంటే 87.70 శాతం.. 12,025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత సాధించినట్టు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ ఫలితాలకు సంబంధించిన మార్కులు, ర్యాంక్ కార్డ్(Rank Card) కోసం వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspxలో చూసుకోవచ్చని సెట్ ఛైర్మన్ డా. అప్పారావు, కన్వీనర్ డా.పీసీ వెంకటేశ్వర్లు(Venkateshwarlu) వెల్లడించారు. ఇక వీటికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *