IND-W vs ENG-W: తొలి టీ20లో భారత్ జయభేరి.. 97 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

ఇంగ్లండ్‌ ఉమెన్స్‌(England Womens)తో జరిగిన మ్యాచులో భారత మహిళల(India Womens) జట్టు అదరగొట్టింది. వారి సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ సీవర్ (42 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్‌) హాఫ్ సెంచరీ చేసింది. బ్రూమౌంట్ 10, అర్లోట్ 12 పరుగులు మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రీచరణి 4 వికెట్లతో సత్తాచాటింది. దీప్తి శర్మ 2, రాధా యాదవ్ 2 వికెట్లు తీయగా, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.

కెరీర్‌లోనే తొలి టీ20 సెంచరీతో మెరిసిన మంధాన

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 210/5 భారీ స్కోరు చేసింది. టీమిండియా(Team India) కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) తన కెరీర్‌ల్లోనే తొలి సెంచరీ(Maiden Century)తో మెరిసింది. ఓపెనర్‌గా వచ్చిన మంధాన వచ్చీరావడంతోనే ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో 51 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. శతకం తర్వాత వేగంగా ఆడే క్రమంలో (112) చేసి ఔటయింది. భారత జట్టులో షెఫాలీ వర్మ 20, హర్లీన్ డియోల్ 43, ఘోష్ 12 రన్స్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెల్ 3 వికెట్లతో రాణించింది. సెంచరీతో చెలరేగిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. నాటింగ్‌హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ ఆల్‌ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 జులై 1న బ్రిస్టల్(Bristol) వేదికగా జరగనుంది.

Smriti Mandhana and Shafali Verma have the most fifty-plus stands in T20Is, England vs India, 1st Women's T20I, Nottingham, June 28, 2025

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *