టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే, నిర్మాతగా బిజీగా ఉంది. సమంత (Samantha) నిర్మాతగా, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన సినిమా‘శుభం’ (Shubham). రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది.
ఇటీవల ముంబయిలోని బాంద్రా జిమ్ నుంచి బయటకు వస్తున్న సమంతను అక్కడ ఉన్న కొంతమంది వీడియోలు తీశారు. ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ కాగా, ఆమె లుక్‌పై నెటిజన్లు నెగటివ్‌గా స్పందిస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. “సమంత బక్కచిక్కిపోయింది”, “అనారోగ్యంతో బాధపడుతోందేమో”, “అవసరమా ఇలాంటి కండిషన్లో జిమ్‌కి రావడం?” అంటూ కామెంట్లు పెట్టారు. గతంలోనూ సమంతపై ఇలాంటివే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆమె ఇంతవరకూ వాటిని ఇన్‌డైరెక్ట్‌గా మాత్రమే స్పందిస్తూ పట్టించుకోలేదు.
అయితే ఈసారి మాత్రం సమంత ట్రోలింగ్కి గట్టి కౌంటర్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్‌లో పుష్అప్స్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేసి, ట్రోలర్స్‌కి ఒక డీల్ కూడా వేసింది. “మీలో ఎవ్వరైనా ఇలా మూడు పుష్అప్స్ చేయండి. తర్వాత నేను బలహీనంగా ఉన్నాను, సన్నగా మారిపోయాను అని కామెంట్ చేయండి. కానీ మీరు చేయలేకపోతే ఇకపై నాపై చెత్త కామెంట్లు చేయొద్దు” అంటూ తేల్చేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు గమనించని నెటిజన్లు కూడా సమంత ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ఫిదా అవుతున్నారు. ట్రోలింగ్‌ను సహించకపోయినా, దానికి సమర్థవంతంగా బదులిచ్చే సమంత స్టాండ్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు.






