విశాఖపట్నం లో జన్మిచిన కోమలి ప్రసాద్(Komalee Prasad) చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించిన ఈ అమ్మడు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది. చదువులోనే కాదు, క్రీడలలోనూ ఆమె టాలెంట్ చూపించింది. జాతీయ స్థాయిలో కోకో, బ్యాడ్మింటన్ క్రీడల్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఆమె ఓ క్లాసికల్ డాన్సర్ కూడా.
మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత కోమలి న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ చదవాలనే ఆలోచనలో ఉండగా, అనుకోకుండా సినిమా అవకాశమొచ్చింది. సినిమా ఛాన్స్ రావడంతో విదేశాల్లో చదువుకోవాలన్న ప్లాన్‌ను పక్కన పెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెటింది. 2016లో ‘సీతాదేవి’ (Seetha Devi)అనే టీవీ సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చిన కోమలి ప్రసాద్ ఆ తర్వాత సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
View this post on Instagram
‘నెపోలియన్’, ‘అనుకున్నది ఒకటి అయినది మరొకటి’, ‘రౌడీ బాయ్స్’, ‘సెబాస్టియన్ పీసీ 524’, ‘హిట్ 2’, ‘హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన నాని బ్లాక్‌బస్టర్ *‘హిట్ 3’*లో ఎస్పీ వర్షా పాత్రలో మెరిశారు. నటిగా మాత్రమే కాకుండా టీవీ షోలలోనూ ఆమె చురుకుగా కనిపిస్తున్నారు. తమిళ చిత్రాల్లోనూ తళుక్కుమన్నారు.
View this post on Instagram
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటలను, వీడియోలను పోస్ట్ చూస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇక తాజాగా కోమలి ప్రసాద్ ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వైట్ కోట్ ధరించి తీసుకున్న కొన్ని ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ – “అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి.. త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతోంది” అనే క్యాప్షన్‌తో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె డెంటిస్ట్ గా మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించినట్టు కోమలి స్పష్టం చేసింది.






