ఇండియా, ఇంగ్లండ్(IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు(Second Test) నేటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. లీడ్స్(Leads)లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్(England) సునాయాసంగా ఛేదించడంతో భారత జట్టు బౌలింగ్ వైఫల్యం బయటపడింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత్(India) గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ మ్యాచుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) దూరమయ్యాడు. వర్క్‌లోడ్ నిర్వహణలో భాగంగా అతను మూడు టెస్టులకు మాత్రమే ఆడతాడని జట్టు నిర్వహణ నిర్ణయించింది.
బుమ్రా స్థానంలో ఎవరు?
బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్(Siraj), ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలు పేస్ బౌలింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, స్పిన్(Spin Bowlling) బౌలింగ్‌కు అవకాశం ఉండటంతో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadhav) లేదా వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. నితీష్ రెడ్డి(Nitish Reddy) కూడా షార్దూల్ ఠాకూర్ స్థానంలో ఆల్‌రౌండర్‌గా జట్టులోకి రానున్నాడు. ఇంగ్లండ్ జట్టు మాత్రం తొలి టెస్టులో విజయం సాధించిన అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. బెన్ డకెట్, జాక్ క్రాలీ, బ్రూక్, స్టోక్స్, స్మిత్, జో రూట్‌లతో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది.
‘బాజ్‌బాల్’ వ్యూహంతో బరిలోకి ఇంగ్లండ్
బెన్ స్టోక్స్(Ben Stokes) నాయకత్వంలో ఇంగ్లండ్ “Buzz Ball” వ్యూహంతో మరోసారి దూకుడుగా ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, మూడు, నాలుగో రోజుల్లో స్పిన్‌కు సహకరిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. వాతావరణం కూడా తొలి రోజు వర్షం సూచనలతో కొంత అనిశ్చితంగా ఉంది. శుభ్‌మన్ గిల్(Shubman Gill) నాయకత్వంలో భారత జట్టు బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, KL రాహుల్‌లపై ఆధారపడనుంది. తొలి టెస్టులో ఐదు సెంచరీలు సాధించినప్పటికీ ఓటమి పాలైన భారత్, ఈసారి బౌలింగ్‌లో శ్రద్ధ పెట్టి సిరీస్‌ను సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
Teamindia might be include Akashdeep and Nitish Kumar Reddy for the 2nd test against England.#INDvsENG2025 #indvseng2ndtest #indvsenglive #NitishKumar #akashdeep pic.twitter.com/xF4PcOjbvq
— Cric Venky (@VenkyK_Offic) June 30, 2025






