టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) జూన్ 20న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ విజయపథంలో దూసుకెళ్తోంది.
మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధనుష్ నటన, సినిమాకున్న ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తూ, సినిమా కలెక్షన్ పరంగా జెట్ స్పీడ్‌లో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
తాజాగా ఎప్పుడు ఈ సినిమాలోని ‘పిప్పీ పిప్పీ డమ్ డమ్ డమ్’ ఫుల్ వీడియో సాంగ్‌ను ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చైతన్య పింగళి రాసిన ఈ పాటకు ప్రముఖ గాయని ఇంద్రవతి చౌహాన్ స్వరభరిత గాత్రాన్ని అందించారు. ఈ వీడియో సాంగ్‌ను ఆదిత్య మ్యూజిక్ మరియు యూట్యూబ్‌లో ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. రష్మికా మాండన్న కథనాయికగా నటించింది. అలాగే జిమ్ సర్బ్, దాలిప్ తాహిల్, సయాజీ షిండే వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సునీల్ నారంగ్ పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్ర నిర్మాతలు.







