KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్(Health Bulliten) విడుదల చేసింది. తీవ్ర జ్వరం(high fever)తో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్(Sugar Levels) అధికంగా పెరిగినట్టు తేలిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని పేర్కొన్నారు.

కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా

మిగిలిన అన్ని టెస్టులు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే(Health is stable) ఉందని తెలిపిన వైద్యులు.. క్లోజ్ అబ్జర్వేషన్‌(Close observation)లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో 2023 డిసెంబర్‌లో KCR తుంటి ఎముక ఫ్రాక్చర్ కారణంగా యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుని కోలుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ చెకప్స్‌ కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరడంతో BRS శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపటి క్రితమే ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *