AP EAPCET-2025: ఈనెల 7 నుంచి ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ

ఏపీ ఈఏపీసెట్(AP EAPCET-2025) అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షలు(Exmas) మే 19 నుంచి 27 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy) పరీక్షలను నిర్వహించారు. మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఆన్‌లైన్(online) విధానంలో జరిగాయి. వీటి ఫలితాల(Results)ను జూన్ 8వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్(Counseling Schedule) విడుదలైంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన EAPCET కౌన్సిలింగ్ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

breaking news ts eamcet counselling dates announcement 2025

22న సీట్ల కేటాయింపు.. ఆగస్టు 4 నుంచి క్లాసులు ప్రారంభం

కాగా తెలంగాణ(Telangana)లో ఇప్పటికే కౌన్సెలింగ్ మొదలుకావడంతో వారితో పాటే APలోనూ పూర్తిచేసేందుకు షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. దీనిపై రేపు (శనివారం) ప్రకటన విడుదల కానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 16 తేదీల్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు(Registration and processing fees) చెల్లింపు. 10 నుంచి 18వ తేదీల్లో వెబ్ ఆప్షన్స్‌(Web Options)కు అవకాశమిస్తారు. 19వ తేదీన వెబ్‌ఆప్షన్ల మార్పు చేసుకోవడానికి అవకాశం. 22న సీట్లు(Seats Allotment) కేటాయించనున్నారు. కాలేజీల్లో రిపోర్టింగ్ 23వ తేదీ నుంచి 26 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీన తరగతులు ప్రారంభం కానున్నాయి.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *