Sarzameen: ఉగ్రవాదిగా సైఫ్​ కొడుకు.. ఆసక్తికరంగా ‘సర్​జమీన్​’ ట్రైలర్​

సలార్​తోపాటు పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్​ సుకుమారన్​ (Prithviraj Sukumaran) బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘సర్‌జమీన్‌’ (Sarzameen). పృథ్వీరాజ్​కు భార్యగా సీనియర్​ నటి కాజోల్ (Kajol)​ నటిస్తోంది. అయితే బాలీవుడ్​లో హీరోగా ఎంట్రీ ఇస్తాడని భావించిన సైఫ్​ అలీఖాన్​ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ (Ibrahim Ali Khan) ఇందులో టెర్రరిస్ట్​ గా విలన్​ రోల్​ పోషిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్​ కానుంది. జులై 25 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించగా.. ఆయన భార్య మీరా పాత్రలో కాజోల్‌ నటించారు. వారి కుమారుడు ఇబ్రహీం చిన్నతనంలోనే ఇంట్లో నుంచి పారిపోయి ఉగ్రవాదిగా మారనున్నట్లు ట్రైలర్​ చూస్తే అర్థమవుతోంది. తండ్రి ఆర్మీ ఆఫీసర్​గా, కొడుకు ఉగ్రవాదిగా సాగే చిత్రంగా కనిపిస్తోంది. కరణ్​ జోహార్​ నిర్మిస్తున్న ఈ మూవీని కాయోజే ఇరానీ(Kayoje Irani) డైరెక్ట్​ చేస్తున్నారు. ఆసక్తిని రేపుతున్న ట్రైలర్​ను మీరూ చూసేయండి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *