BJP Telangana President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన అధ్యక్షుడిగా మాజీ MLC, సీనియర్ న్యాయవాది ఎన్. రామచందర్ రావు(N. Ram Chandar Rao) శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఉదయం 10 గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ వద్ద గన్ పార్క్‌లో శ్రద్ధాంజలి ఘటించి, అనంతరం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan reddy) స్థానంలో రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు, MPలు, MLAలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ ఐక్యత కోసం కృషి చేస్తా..

రామచందర్ రావు, తన నాయకత్వంపై వచ్చిన ‘డమ్మీ’ అనే విమర్శలను ఖండిస్తూ, పార్టీ ఐక్యత కోసం కృషి చేస్తానని, తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటానని ప్రకటించారు. ఆయన గతంలో ABVP నాయకుడిగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడిగా గణనీయమైన అనుభవం కలిగి ఉన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం రామచందర్ రావు ముందున్న ప్రధాన సవాళ్లు. ఆయన నాయకత్వంలో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచి, 2028 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *