Pan India Movies: పాన్ఇండియా మూవీల ఎఫెక్ట్.. చిన్న సినిమాలపై భారీ ప్రభావం!

ప్రస్తుతం భారతీయ సినీఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్(Pan India movie trend) నడుస్తోంది. ఇందుకు మూలం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (2015, 2017) చిత్రాలు, ఇవి తెలుగు సినిమా నుంచి ఉద్భవించి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రేక్షకాదరణ పొందాయి. ఒకే చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి బహుళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడమే పాన్ ఇండియా రేంజ్. దీనివల్ల భాషా సరిహద్దులను అధిగమించి భారీగా ప్రేక్షకులను సొంతం చేసుకోవడం. టెక్నాలజీ(Technology) పరంగా సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకు సపోర్టీవ్‌గా OTT ప్లాట్‌ఫారమ్‌లూ ఉన్నాయి. వీటికి తోడు సినిమాలు డబ్బింగ్ ద్వారా విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ‘పుష్ప’, ‘KGF’, ‘సలార్’ వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌ను మరింత బలోపేతం చేశాయి.

Pan-Indian cinema: A plague of tiring sequels, buzzkill cliffhangers,  ineffective cameos and half-films - The Hindu

ఒకరు కాదు ఇద్దరు కాదు..

ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది కాలంగా జనాలకు మిడ్ రేంజ్ సినిమాలు(Mid-range movies), హీరోలు పెద్దగా నచ్చడం లేదు. మంచి కాన్సెప్ట్ తో ఉన్న చిన్న సినిమా నచ్చుతోంది. లేదా పెద్ద హీరోల సినిమాలు నచ్చుతున్నాయి. ఈ మధ్యలో ఉండే మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్(Box Office) దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. మిడ్ రేంజ్ హీరోలకు బాగా కష్ట కాలంగా మారుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు మిడ్ రేంజ్ హీరోల అందరి పరిస్థితి ఇదే. కంటెంట్ బాగుంటే మిడ్ రేంజ్ ఏమిటి, బిగ్ రేంజ్ ఏమిటి అనడం వరకు సులువే. కానీ అసలు మినిమమ్ అంటే మినిమమ్ ఓపెనింగ్ పడాలి కదా. ఆ తరువాత కంటెంట్ సంగతి. అసలు 5 నుంచి 10%శాతం ఓపెనింగ్ పడకపోతే ఎలా?

How Does OTT Platforms Earn Money? & It's Business Models

ఆ హీరోలు అంతా సాలిడ్ హిట్ కొట్టాల్సిందే..

మిడ్ రేంజ్ హీరోలైన గోపీచంద్(Gopichand), శర్వానంద్, నితిన్, విష్వక్ సేన్, సుధీర్ కుమార్, బెల్లంకొండ, వరుణ్ తేజ్(Varun Tej), అల్లరి నరేష్ ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. మరోవైపు వీళ్లకు ఓటీటీ మార్కెట్(OTT market) కూడా తగ్గుతూ వస్తోంది. చూస్తోంటే ఈ పరిస్థితి రాను రాను ఇంకా జటిలం అయ్యేలా వుంది. సినిమాలు హిట్ కాకుండా జనాలకు ఇంట్రస్ట్ పోతోంది. ఓపెనింగ్ పడడం లేదు. అందుకే 2026 లోపల ఈ రేంజ్ హీరోలు అంతా సాలిడ్ హిట్ కొట్టాలి. అప్పుడు కానీ టైమ్ టర్నింగ్ ఇచ్చుకోదు. హిట్ కొట్టకుంటే వీరందరికీ కష్టకాలమే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *