ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) తండ్రి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత శివ శక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కీరవాణి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా శివ శక్తి దత్తా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గేయ రచయిత, దర్శకుడి(Director)గా తనదైన ముద్ర వేశారు. ఆయన రాసిన పాటలు(Songs) సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన సినీ రంగంలో చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆయన మరణవార్త తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు నింపింది.
కమలేశ్ అనే కలం పేరుతో..
శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు(Koduri Subbarao). 1932 అక్టోబరు 8న రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు(Kovvuru)లో జన్మించారు. చిన్న తనంలోనే కళలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబైలోని ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చి కమలేశ్(Kamalesh) అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్, సితార, హార్మోనియం నేర్చుకున్నారు.

సినీ ప్రముఖులు, అభిమానుల సంతాపం
శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కల్యాణి మాలిక్, శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. శివశక్తి దత్తా సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, బాహుబలి 2, RRR, హనుమాన్ వంటి పలు సినిమాలకు పాటలు రచించారు. కాగా ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Music director #KeeraVani’s father, Popular Siva Sakthi Datta garu passed away.
He is a lyricist, poet, screenwriter, and painter.
Om Shanthi 🙏#SivaSakthiDarta pic.twitter.com/IrGt9jUWOY
— Suresh PRO (@SureshPRO_) July 8, 2025






