Texas Floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. వంద మందికిపైగా మృతి

అమెరికాలోని టెక్సాస్(Texas) రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు(Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 104 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుర్ఘటనలో కెర్ కౌంటీ(Kerr County)లోని బాలికల వేసవి శిబిరంలో చోటుచేసుకున్న విషాదం అందరినీ కలచివేస్తోంది. ‘క్యాంప్ మిస్టిక్(Camp Mystic)’ అనే ఈ శిబిరంలో బస చేస్తున్న 27 మంది బాలికలు, సిబ్బంది వరద ఉధృతికి బలయ్యారు. మరో 10 మంది అమ్మాయిలు, ఒక క్యాంప్ కౌన్సిలర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Death toll in Texas floods rises to at least 51 as search continues for many missing, officials say | PBS News

గ్వాడాలుపే నది ఆకస్మికంగా ఉప్పొంగడంతో..

గ్వాడాలుపే నది(Guadalupe River) ఆకస్మికంగా ఉప్పొంగడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమయంలో చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించి, క్యాంప్ డైరెక్టర్ రిచర్డ్ ఈస్ట్‌లాండ్ (70) కూడా ప్రాణాలు అర్పించారు. ఆయనో హీరోలా మరణించారని స్థానికులు కొనియాడారు. సహాయక బృందాలు బురదలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఈ విపత్తుపై రాజకీయ దుమారం(Political bullshit) రేగింది. జాతీయ వాతావరణ శాఖ (NWS)లో ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగాల కోత విధించడం వల్లే ముందస్తు హెచ్చరికల వ్యవస్థ విఫలమైందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్(White House) తీవ్రంగా ఖండించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *