2012లో మాస్క్(Mask) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, బుట్టబొమ్మగా గుర్తింపు పొందిన హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde). ఆ తర్వాత ఒక లైలా కోసం(Oka Laila Kosam), ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, F-3, బీస్ట్, ఆచార్య(Acharya), రాదేశ్యామ్ వంటి సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. చాలా రోజులు సౌత్ ఇండస్ట్రీ(South Industry)లో టాప్ హీరోయిన్‌గానూ వెలుగొందిన పూజా హెగ్డేకు ఈమధ్య కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపుల కారణంగా ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది.

వరుస డిజాస్టర్లే కారణమా..
ఈ ప్రభావం తాజాగా ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్‌పై పడింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Kollywood Star Dhanush) #D54లో సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మలయాళ బ్యూటీ మమితా బైజు(Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో విజయాలు, అపజయాలు కెరీర్‌ను ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గతంలో పూజా హెగ్డే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా భారీ రెమ్యునరేషన్(Remunaration) అందుకున్నారు. అయితే ‘రాధే శ్యామ్(Radhe Shyam)’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ నుంచి ఇటీవల వచ్చిన ‘రెట్రో’ వరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
Is this Dhanush’s boldest move yet? #D54 launches TODAY, July 10, 2025, with OM NAMASHIVAAYA vibes! Directed by Vignesh Raja, starring Mamitha Baiju, Jayaram & Suraj Venjaramoodu. A cinematic revolution begins! #Dhanush #D54Launch #TamilCinema https://t.co/bmw50PHasH
— Daily Trending Now (@Trend_247_Daily) July 10, 2025
‘ప్రేమలు’ సినిమాతో..
దీంతో ఆమె క్రేజ్ కొంతమేర తగ్గింది. ఈ నేపథ్యంలోనే ధనుష్ హీరోగా దర్శకుడు విగ్నేష్ రాజా(Director Vignesh Raja) తెరకెక్కించనున్న కొత్త సినిమా కోసం మొదట పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆమెను పక్కనపెట్టి, ‘ప్రేమలు(Premalu)’ సినిమాతో సెన్సేషన్ అయిన మమితా బైజును ఫైనల్ చేశారని కోలీవుడ్(Kollywood) వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.






