భారీ అంచనాలతో విడుదలైన కన్నప్ప (Kannappa) మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ కనిపించిన 20 నిమిషాలు మాత్రం మూవీకే హైలైట్. ఇక హీరోయిన్గా నటించిన ప్రీతి ముకుందన్ (Preity Mukundhan) సైతం తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తప్ప పెద్దగా బయట కనిపించన ప్రీతి.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ (Prabhas) గురించి మాట్లాడింది. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుందని కొనియాడింది.
అనుకోకుండా అవకాశం వచ్చింది..
‘కన్నప్ప లాంటి భారీ ప్రాజెక్ట్ అనుకోకుండా అవకాశం వచ్చింది. సవాలుగా రోల్స్ పాత్రలంటే నాకు ఇష్టం. అవి కష్టంగా ఉన్నప్పటికీ గుర్తింపు తెస్తాయి. అలాంటి రోల్స్ ఉంటే ఆడిషన్ ఇవ్వడానికి సిద్ధమే. కన్నప్పలో ప్రభాస్‌తో (Prabhas) కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది. ఆయన ప్రత్యేకత స్క్రీన్‌పై కూడా స్పష్టంగా కనిపించింది. నిజ జీవితంలోనూ ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ సాధారణంగా ఉంటారు. ఎవరినీ చిన్నచూపు చూడరు. సెట్లో అందరినీ గౌరవిస్తారు. హి ఈజ్ సో స్వీట్’ అని ప్రీతి ముకుందన్ అన్నారు.
Though #Prabhas has a powerful presence and massive stardom, he never looks down on anyone. He’s warm, respectful and mingles with everyone like one among us. There’s always a positive vibe around him on set.
– #PreityMukhundhan pic.twitter.com/USo1ObXGDP— Prabhas RULES (@PrabhasRules) July 14, 2025
శరవేగంగా రాజాసాబ్ షూటింగ్
ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’(The Raja Saab)తోపాటు సందీప్ వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ (Spirit) మూవీ చేస్తున్నారు. ది రాజాసాబ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. కుటుంబ నేపథ్యం, ఆత్మల కథతో సాగే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇక స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది అలరించనుంది. ప్రీతి విషయానికొస్తే ఓం భీమ్ బుష్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కన్నప్పతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘మైనే ప్యార్ కియా’, ‘సర్వం మాయ’, KH15, ‘ఇదయం మురళి’ వంటి పలు దక్షిణాది మూవీలో నటిస్తోంది.






