sudigali sudheer: ఇంట్లో కూర్చొని ఆట ఆడి బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటారా.. చూసేయండి మరి..

ప్రముఖ తెలుగు ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ “ఆహా”(Aha)లో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 5 గేమ్ షో(Sarkaar seasion 5 game show) ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంటోంది. జూన్ 6న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఆరు ఎపిసోడ్లు పూర్తి చేసుకుని, సక్సెస్‌ఫుల్ రన్‌లో దూసుకెళ్తోంది. సుడిగాలి సుధీర్(Sudigali Sudeer) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తుండటంతో టాప్ రేటింగ్స్‌(Top Ratings) అందుకుంటోంది.

ఇప్పటికే కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, హర్ష్ రోహన్, కోమలి ప్రసాద్, యాదమ్మ రాజు, బ్రిగిడా, విజయ్ ఆంటోనీ వంటి ప్రముఖులు ఈ గేమ్ షోలో పాల్గొన్నారు. గేమ్ షోలో పాల్గొనే వారి ఆటతీరు, కామెడీ, పాటలు, ప్రాంక్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈసారి ప్రేక్షకులకు కూడా అదిరే అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు కేవలం వీక్షకులుగా ఉన్న ఈ షోలో, ఇప్పుడు ఇంటి నుంచే పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. షో చూస్తూ తెరపై కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేసి, వచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే, స్పోర్ట్స్ బైక్( Win a Bike) వంటి విలువైన గిఫ్ట్‌లు గెలుచుకునే అవకాశముంటుంది.

ఇక ఈ శుక్రవారం (జులై 18)(July 18) ప్రసారం కాబోయే 7వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ నటుడు శివ కుమార్, ప్రముఖ గాయనీ సమీరా, రాపర్ రోల్ రైడా పాల్గొన్నారు. గేమ్, పాటలతో ఈ ఎపిసోడ్ మోజుతో నిండిపోనుంది. ఈ ఎపిసోడ్ జులై 18న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఆహా సర్కార్ సీజన్5..  7వ ఎపిసోడ్ ప్రోమో

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *