ప్రముఖ తెలుగు ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ “ఆహా”(Aha)లో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 5 గేమ్ షో(Sarkaar seasion 5 game show) ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంటోంది. జూన్ 6న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఆరు ఎపిసోడ్లు పూర్తి చేసుకుని, సక్సెస్ఫుల్ రన్లో దూసుకెళ్తోంది. సుడిగాలి సుధీర్(Sudigali Sudeer) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తుండటంతో టాప్ రేటింగ్స్(Top Ratings) అందుకుంటోంది.
ఇప్పటికే కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, హర్ష్ రోహన్, కోమలి ప్రసాద్, యాదమ్మ రాజు, బ్రిగిడా, విజయ్ ఆంటోనీ వంటి ప్రముఖులు ఈ గేమ్ షోలో పాల్గొన్నారు. గేమ్ షోలో పాల్గొనే వారి ఆటతీరు, కామెడీ, పాటలు, ప్రాంక్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈసారి ప్రేక్షకులకు కూడా అదిరే అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు కేవలం వీక్షకులుగా ఉన్న ఈ షోలో, ఇప్పుడు ఇంటి నుంచే పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. షో చూస్తూ తెరపై కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేసి, వచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే, స్పోర్ట్స్ బైక్( Win a Bike) వంటి విలువైన గిఫ్ట్‌లు గెలుచుకునే అవకాశముంటుంది.
ఇక ఈ శుక్రవారం (జులై 18)(July 18) ప్రసారం కాబోయే 7వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ నటుడు శివ కుమార్, ప్రముఖ గాయనీ సమీరా, రాపర్ రోల్ రైడా పాల్గొన్నారు. గేమ్, పాటలతో ఈ ఎపిసోడ్ మోజుతో నిండిపోనుంది. ఈ ఎపిసోడ్ జులై 18న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఆహా సర్కార్ సీజన్5.. 7వ ఎపిసోడ్ ప్రోమో
View this post on Instagram






