
సీనియర్ నటుడు సుమన్(Senior Actor Suman) తన కెరీర్‌ను మరోసారి టెలివిజన్ తెరపై కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు అన్నమయ్య వంటి చిత్రాలతో క్లాసికల్ హిట్ అందుకున్న సుమన్, లవ్, యాక్షన్, కామెడీ మూవీల్లోనూ తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అనంతరం సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, టీవీ రంగంలోకి అడుగుపెట్టి అర్చన, యమలీల, దాంపత్యం వంటి సీరియల్స్‌లో కనిపించి మెప్పించారు.
మళ్ళి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత.. ఇప్పుడు సుమన్ కన్నడ సీరియల్ స్నేహద కదలల్లి(Snehada Kadalalli)లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ నటుడు చందు గౌడ(Chandu Gouda) ఇందులో హీరోగా నటిస్తుండగా, సుమన్ అతని తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సీరియల్ తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న సప్తపదిలోనూ సుమన్ అదే పాత్రను పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ మాలో త్వరలోనే ఈ సీరియల్ ప్రసారం కానుంది.
ఈ రీమేక్‌ను ‘ఇంటింటి రామాయణం’ వంటి విజయవంతమైన సీరియల్‌ను నిర్మించిన యునిక్యూ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్‌కు టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. సుమన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగు టీవీ రంగంలో అడుగుపెడుతుండటంతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.
ప్రస్తుతం టీవీ రంగంలో పలువురు సీనియర్ నటులు, నటి ఆమని, పవిత్రలోకేష్ లాంటి వారు సీరియల్స్ చేస్తుండగా, సుమన్ కూడా మరోసారి టీవీలో నటించడం విశేషం. నటనలో ప్రత్యేక శైలి కలిగిన ఆయన, ఈ కొత్త పాత్రతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.