మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన సెకండ్ ఇన్నింగ్స్‌ను దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిన చిరు, ఇటీవల విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’(Valteri Veerayya) మూవీతో మాస్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’(Viswambhara), ఇది ఒక ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా. ‘బింబిసార’(Bimbisara) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట మల్లిడి(Vasista Malladi) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
పౌరాణిక శైలిలో, ఆధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్లో ఫుల్ లెంగ్త్ సోషియో ఫాంటసీ సినిమా ఇది కావడం విశేషం. ఈ చిత్రం ప్రారంభంలో హీరోయిన్ ఉండదని ప్రకటించినా, ప్రస్తుతం త్రిష, మౌనీ రాయ్, అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి నటుల పాత్రలు చేరారు. కథలో మార్పులు జరిగాయా? లేక అభిమానుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
ఇక కథ విషయానికి వస్తే… వశిష్ట మాట్లాడుతూ – ఈ సినిమా “జగదేకవీరుడు”, “బైరవ ద్వీపం” లాంటి పాత సినిమాల రీమేక్ కాదని స్పష్టం చేశారు. ఓ హీరో 14 లోకాలు దాటి సత్యలోకానికి వెళ్లడం, అక్కడి నుండి తిరిగివచ్చే ప్రయాణం ఇతివృత్తమని వివరించారు. ఇందులో రెక్కల గుర్రానికి మంచి ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకొచ్చాడు వశిష్ట..
“విశ్వంభర” సినిమాను 2025 సెప్టెంబర్‌లో విడుదల చేయాలని యూనిట్ ప్రయత్నిస్తోంది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ “OG”, బాలకృష్ణ “అఖండ 2” లాంటి భారీ సినిమాలు విడుదల కానుండటంతో, సినిమా 2026 సమ్మర్‌కి వాయిదా పడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనా త్వరలో రానుంది.






