ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.
IBPS PO/MT 2026-27 నోటిఫికేషన్:
IBPS 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 21 జూలై 2025 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి(Degree Qualification)చేసిన అభ్యర్థులు అర్హులు. వయో పరిమితి 20–30 ఏళ్లు కాగా, కేటగిరీలను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. నెల వేతనం ₹48,480 నుంచి ₹85,920 వరకు ఉంటుంది. దరఖాస్తు చివరితేది జూలై 21, 2025. పరీక్షలు ఆగస్ట్, అక్టోబర్ 2025లో, ఇంటర్వ్యూలు డిసెంబర్ 2025 – జనవరి 2026 మధ్యలో జరుగుతాయి.
వెబ్‌సైట్: ibps.in
SSC JE 2025 నోటిఫికేషన్:
SSC ద్వారా 1,340 జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ కలిగిన అభ్యర్థులు అర్హులు. వయసు 30 ఏళ్లు లోపు ఉండాలి. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా జరుగుతుంది. వేతనం ₹35,400 నుంచి ₹1,12,400 వరకూ ఉంటుంది. దరఖాస్తుకు చివరితేది జూలై 21, 2025. CBT పరీక్షలు అక్టోబర్ 27 నుంచి 31 మధ్య, పేపర్-2 జనవరి–ఫిబ్రవరి 2026లో జరుగుతాయి.
వెబ్‌సైట్: ssc.gov.in ఈ రెండు అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశంగా మారనున్నాయి.






