బంగారం ధరలు (Gold Rate) మరోసారి భారీగా పెరిగి రూ.లక్ష మార్క్ దాటింది. పలు అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold & Silver Rates)కు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని తమ రిజర్వ్‌లో భాగంగా కొనుగొంటున్నాయి. ఇది బంగారం ధరకు అదనపు మద్దతు ఇస్తోంది.
ఈ ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా ఈరోజు (July 22) హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.92,850కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,140 పెరిగి రూ.1,01,290కి చేరింది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ. 2,000 పెరిగి రూ.1,28,000గా కొనసాగుతోంది. ఆకాశన్నంటున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.






