IND vs ENG: నాలుగో టెస్టులో బుమ్రా ఆడటంపై సిరాజ్ ఏమన్నాడంటే?

టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సిరాజ్ ప్రెస్‌కాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది అదే. ఆకాశ్ దీప్ గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతను ఈ రోజు బౌలింగ్ చేశాడు. ఇక ఫిజియోలు చూసుకుంటారు. వారి నుంచి అప్‌డేట్ రావాల్సి ఉంది. టీమ్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. మనం ఓపికగా ఉండాలి. సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి. అదే మా ప్లాన్’అని చెప్పాడు.

వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలనుకుంటున్నా..

ఇక తన వర్క్‌లోడ్‌(Workload) గురించి మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేశం కోసం వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలనుకుంటున్నా.’ అని తెలిపాడు. అలాగే, మూడో టెస్టులో తాను అవుటైన తీరుపై స్పందిస్తూ..‘చాలా ఎమోషన్ అయ్యాను. 22 పరుగులతో ఓడటం బాధగా అనిపించింది. నేను అవుటవుతానని అనుకోలేదు. అది నా తప్పిదమే. అది చాలా హృదయ విదారకమైనది. ఆ మ్యాచ్‌లో మేము గెలిస్తే పరిస్థితులు మరోలా ఉండేవి. ఆ బాధ చాలా కాలం ఉంటుంది. జడ్డూ భాయ్ పోరాడాడు. సిరీస్ ఇంకా ముగియలేదు. నేను నా బ్యాటింగ్‌ మెరుగుపర్చుకోవడానికి కష్టపడుతున్నా’ సిరాజ్ అని చెప్పుకొచ్చాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *