పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా, బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.
ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలు టాలీవుడ్లో చాలా కాలంగా విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా రావడం, దానికి పోటీగా మరో పెద్ద సినిమా లేకపోవడంతో ‘వీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద ఓ సెన్సేషన్ సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 80% నుంచి 90% థియేటర్లలో వీరమల్లు ప్రదర్శించనున్నారు. చిన్న పట్టణాల్లో అయితే అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో ఈ సినిమానే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో పవన్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల అక్కడ 150లో 135 థియేటర్లలో వీరమల్లు నే ప్రదర్శించనున్నారు.
గత వారాల్లో విడుదలైన చిన్న చిత్రాలైన ‘జూనియర్’, ‘కొత్తపల్లిలో’ కలెక్షన్ల పరంగా నీరసనే మిగిల్చాయి. కాగా వచ్చే వారం థియేటర్లలో వీరమల్లుకే కేటాయించే అవకాశం ఉంది. పెద్ద నగరాల్లో ప్రధాన షెడ్యూల్ వీరమల్లుకే కేటాయించనున్నారు. తెలంగాణలోనూ పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా అక్కడ కూడా సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ప్రభుత్వం ప్రీమియర్ షోలకూ టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వడం, పాజిటివ్ మౌత్ టాక్ వస్తే… వీరమల్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.






