Jagdeep Dhankhar: ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

ఉపరాష్ట్రపతి జగ్​దీప్ ధన్​‌ఖడ్(Vice President Jagdeep Dhankhar) రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామా(Dhankhar’s resignation)ను రాష్ట్రపతి ముర్ము హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ధన్‌ఖడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభ(Rajya Sabha)లో హోం మంత్రిత్వ శాఖ(Ministry of Home) ప్రకటించింది. కాగా నిన్న తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.

తన పదవీకాలంలో తనకు అన్ని విధాలా మద్దతుగా ఉన్నందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర మంత్రి మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ధన్ ఖడ్ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారు.

కాగా 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ ఎంపికయ్యారు. అంతకుముందు 1990-1991 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019-22 వరకు బెంగాల్ గవర్నర్‌గా సేవలు అందించారు. రాజీనామాకు ముందు పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ముందు సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సభ్యులు భేషజాలకు పోకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని కోరారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *