
బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకా(Dhaka)లోని ఘోర విమానం ప్రమాదం జరిగింది. ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో ఆ దేశ వైమానిక దళానికి చెందిన F-7BGI శిక్షణ విమానం మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ( Milestone School and College) ప్రాంగణంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 31 మంది మరణించగా, 170 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు(Students) ఉండగా, మృతుల్లో 25 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1:06 గంటలకు (స్థానిక కాలమానం) శిక్షణ రన్ కోసం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్య(Technical Issue) తలెత్తినట్లు సైన్యం తెలిపింది. పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మహ్మద్ తౌకిర్ ఇస్లాం జనసమూహంలేని ప్రాంతంలోకి విమానాన్ని మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ, అది రెండు అంతస్తుల స్కూల్ భవనంలోకి దూసుకెళ్లి మంటలు చెలరేగాయి.
🚨 At least 29 students of Dhaka city’s Milestone School & College have been rushed to the National Burn Unit with serious injuries following crash of a Chinese-made F-7 fighter jet of the Bangladesh Air Force. The incident took place at 1:06 pm local time. pic.twitter.com/xONpIuKy1S
— Mebsi (@MebsiLFC) July 23, 2025
విషమంగా 48 మంది పరిస్థితి
ఈ ప్రమాదంలో పైలట్(Pilot)తో సహా అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరణించారు. ప్రమాద స్థలంలో భారీ మంటలు, దట్టమైన పొగ చూసిన ప్రత్యక్ష సాక్షులు భయంతో పరుగులు తీశారు. అత్యవసర సిబ్బంది, సైన్యం, అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని హెలికాప్టర్లు, రిక్షాల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ఢాకాలోని ఏడు ఆసుపత్రుల్లో గాయాళ్లకు చికిత్స అందిస్తున్నారు, వీరిలో 48 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దర్యాప్తుకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా నేడు (జులై 23) జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో ఇటీవలి దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచిందని అక్కడి అధికారులు తెలిపారు.
బంగ్లా ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కాగా బంగ్లాదేశ్‌లో విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బంగ్లాదేశ్‌కు అండగా ఉంటామని మోదీ తెలిపారు. కాగా ఈ ఘటనలో గాయాలపాలైన బాధితులకు వైద్య సహాయం అందించేందుకు స్పెషలిస్టు డాక్టర్లను భారత ప్రభుత్వం ఇప్పటికే బంగ్లాదేశ్‌కు పంపించింది. క్షతగాత్రుల పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే వారిని భారత్‌కు తీసుకొచ్చి చికిత్స అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
#BREAKING: India to send a team of burn-specialist Doctors & Nurses with necessary medical support to Dhaka shortly to treat the victims of the air crash in Bangladesh. They will make an assessment of the condition of patients with recommendation for further treatment and… pic.twitter.com/3HfkhTnav2
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 22, 2025