Supreme Court: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు(Mumbai train blasts case)కు సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు నిర్దోషులేనని తీర్పు వెలువరిస్తూ ఇతర కేసులు ఏవీ లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో నిందితులను అధికారులు విడుదల చేశారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే విధించింది. అయితే, ఇప్పటికే విడుదల చేసిన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ అప్పీల్పై స్పందన తెలియజేయాలని 11 నిందితులకు నోటీసులు జారీ చేసింది.
2006 జులై 11న ఏం జరిగిందంటే..
2006 జులై 11న ముంబై సబర్బన్ రైల్వే నెట్వర్క్(Mumbai Suburban Railway Network)లో జరిగిన ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో మొత్తం 189 మంది దుర్మరణం చెందగా, మరో 800 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు 12 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు వారిని జైలుకు పంపించింది. బాంబులు అమర్చినట్లు తేలిన ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఒకరు కరోనాతో మరణించారు. మిగతా నిందితులు దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా.. ఇటీవల వారందరినీ హైకోర్టు నిర్దోషులుగా తేల్చి విడుదలకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో పదకొండు మంది నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు.
SC says Bombay HC’s acquittal of 12 in 2006 Mumbai train blasts won’t set a legal precedent. Maharashtra govt challenges ruling; SG Mehta warns of wider impact on MCOCA trials. Justice for 189 dead & 800 injured now under fresh SC scrutiny.
Read More at: https://t.co/cHZpD0Psoz…
— Benefit News 24 (@BenefitNews24) July 24, 2025






