వాట్సాప్(WhatsApp Storage) వాడే ప్రతి ఒక్కరికీ ఇదొక సాధారణ సమస్య.. ఫోన్ స్టోరేజ్(phone Storage)ను ఫోటోలు(Photos), వీడియోల(Videos)తో నింపేయడం. మీరు ఎవరి నుంచైనా ఫైళ్లను పంపుకున్న అవి ఆటోమేటిక్‌గా గ్యాలరీ(Gallery Filling)లోకి చేరతాయి. అందువల్ల మీ ఫోన్ మెల్లగా పనిచేయడం, హ్యాంగ్ అవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఓ చిన్న సెట్టింగ్(WhatsApp Setting) మార్పుతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.
వాట్సాప్(WhatsApp)లో ఫోటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీలో సేవ్ కాకుండా నిరోధించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మీరు అన్ని చాట్స్(Chats)కి ఒకేసారి అప్లై చేయాలనుకుంటున్నారా, లేక ప్రత్యేకంగా ఒక్కో చాట్‌కే చేయాలనుకుంటున్నారా అనే విషయం మీరే ఆలోచించుకోవాలి.
అన్ని చాట్‌లకు గ్యాలరీ సేవ్ ఆపడం ఇలా:
1. WhatsApp ఓపెన్ చేయండి
2. కుడివైపు పైభాగంలో కనిపించే మూడు చుక్కలు (Menu) క్లిక్ చేయండి
3. Settings > Chats సెక్షన్‌లోకి వెళ్లండి
4. అక్కడ Media visibility అనే ఆప్షన్‌ను OFF చేయండి.
ఈ విధంగా ఎవరైనా పంపిన ఫోటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ కాకుండా నిరోధించవచ్చు.
ఒక్క వ్యక్తి లేదా గ్రూప్ కోసం సేవ్ ఆపడం ఇలా:
1. ఆ వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయండి
2. మెనూ (మూడు చుక్కలు) క్లిక్ చేసి View Contact లేదా Group Info ఎంచుకోండి
3. అక్కడ Media visibility అనే ఆప్షన్‌ను OFF చేయండి.
ఈ సెట్టింగ్ ద్వారా ఫోటోలు గ్యాలరీలోనికి వచ్చేవి ఆపేయవచ్చు. ఈ మార్గాలు ఫోన్ స్టోరేజ్‌ను కాపాడడంలో ఎంతో ఉపయోగపడతాయి.






